ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల స్థాయిలో రెడ్‌క్రాస్‌ ఎన్నికలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-01-18T05:03:50+05:30

మండల స్థాయిలో ఈనెల 27న రెడ్‌క్రాస్‌ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ణరెన్స్‌ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జనవరి 17: మండల స్థాయిలో ఈనెల 27న రెడ్‌క్రాస్‌ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ణరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి సభ్యులు అర్హతలు సాధిస్తారని తెలిపారు. మండల స్థాయిలో పది మంది సభ్యులను ఎన్నుకుని వారి నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోవాలని తెలిపారు. ఇద్దరు సభ్యులను డివిజన్‌ లెవల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి పంపవలసి ఉంటుందని తెలిపారు. 28 డివిజనల్‌, 29న జిల్లా స్థాయి రెడ్‌క్రాస్‌ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించాలి

కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్‌, షార్ట్‌ ఫిలిం పోటీలు ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇంటర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా చూడాలని తెలిపారు. మాచారెడ్డి, గాంధారి, నిజాంసాగర్‌, లింగంపేట మండలాల్లో రేపటి నుంచి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా తనిఖీ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్‌ యోజన పథకం, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను బృందం సభ్యులు పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. కావున ఉపాధిహామీకి 7 రిజిస్టర్‌లు, పని చేసిన చోట వర్క్‌బోర్డులు, డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు వినియోగంలో ఉండే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయిభుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising