ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీల కోసం రాస్తారోకో

ABN, First Publish Date - 2022-05-25T05:44:54+05:30

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని లింగంపల్లి రైతులు మంగళ వారం తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని కోరుతూ ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిపై ద్విచక్ర వాహనాలను అడ్డు పెట్టి రాస్తారోకో చేశారు.

లింగంపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట, మే 24: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని లింగంపల్లి రైతులు మంగళ వారం తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని కోరుతూ ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిపై ద్విచక్ర వాహనాలను అడ్డు పెట్టి రాస్తారోకో చేశారు. లింగంపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధాన్యం తూకం పూర్తయినా లారీలు రాక పోవడంతో ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రం వద్దనే ఉన్నాయని వాటిని తరలించే వరకు రైతులు కాపలా ఉం డాల్సి రావడంతో లారీలు పంపాలని కోరుతూ రాస్తారోకో చేశారు. 20 రోజులుగా కేవలం 7 లారీల ధాన్యం మాత్రమే రైస్‌మిల్లులకు తరలించా రని కొనుగోలు కేంద్రం వద్ద మరో 30 లారీల ధాన్యం నిల్వ లు ఉన్నాయని లారీలను తొందరగా పంపేలా చూడాలని సహకార సంఘం అధికారులను, వ్యవసాయ అధికారు లను, రెవెన్యూ అధికారులను కోరినా వారు స్పందించడం లేదని రైతులను చిన్నచూపు చూస్తున్నారని వారు అధికారు ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాలు తూకం వేసిన తరువాత 20 రోజుల పాటు కొనుగోలు కేంద్రం వద్దనే ఉండడంతో తేమ శాతం పూర్తిగా తగ్గిపోతు ందని రైస్‌మిల్లర్లు సైతం ధాన్యం బాగా లేదని ఒక లారీకి 8 బస్తాల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతు న్నారు. రాస్తారోకో విషయం తెలుసుకుని ఎస్సై శంకర్‌, తహసీల్దార్‌ మారుతి, సహకార సంఘం చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి రైతుల వద్దకు వెళ్లి విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తా మని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సురేందర్‌, కృష్ణమూర్తి, రాములు, పూల్యానాయక్‌ రైతులు ఉన్నారు. 


ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి రూరల్‌ : ధాన్యం కాంటా చేసి ఉన్న ధాన్యం బస్తాలు రైస్‌మిల్లులకు తరలించడానికి లారీలు సకాలంలో రావడం లేదని రైతులు మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్‌ గేట్‌ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం చేసి ఉన్న ధాన్యం బస్తాలు అకాల వర్షాలు వస్తే తడిసే అవకాశం ఉందని లారీలు సమయానికి రావడం లేదని అన్నారు. రైతులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులను లారీలను పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Updated Date - 2022-05-25T05:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising