ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భినులకు పౌష్టికాహారం అందించాలి

ABN, First Publish Date - 2022-12-07T00:33:22+05:30

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్మూర్‌టౌన్‌, డిసెంబరు 6: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతీ వార్డును పరిశీలించి రోగులు, గర్భిణులతో మాట్లాడారు. నీటి వసతి, పారిశుధ్యం, వైద్యసేవలు, మెనూ ప్రకారం టీఫిన్‌, భోజనం అందుతున్నాయా అని ఆరా తీశారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని సూపరింటెండెంట్‌ నాగరాజుకు సూచించారు. గర్భిణులు స్కానింగ్‌ను బయట చేసుకోవాల్సి వస్తుందని తెలపగా వెంటనే టీఫా(టార్గెటెడ్‌ ఇమెజింగ్‌ ఫర్‌ ప్యూటన్‌ ఎనామిలిస్‌) స్కానింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 22వేల610 ప్రసవాలు జరగడంతో సిబ్బందిని అభినందించారు. ప్రతినెలా 500 ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని వారికి సూచించారు. వంద పడకల ఆసుపత్రిగా మారడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కృషి ఉందని, త్వరలో డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. పది రోజుల్లో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని బాలింతలకు మంత్రి కేసీఆర్‌ కిట్‌లను అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ.గౌడ్‌, డాక్టర్‌ మధుశేఖర్‌, ఎంపీపీ పస్కనర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌మున్న, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. కాగా, అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో గల అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి పూలమాలతో నివాళులు అర్పించారు.

హరీశ్‌రావును సన్మానించిన వేముల

వేల్పూర్‌: వేల్పూర్‌లో మంత్రి హరీశ్‌రావుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి సన్మానించారు. జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యాటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో మంత్రిహరిష్‌రావుతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌ జగిత్యాల బహిరంగ సభకు సంబంధించి జనసమీకరణపై నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, పీయుసీచైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ.గౌడ్‌లతో కలిసి సమావేశమై చర్చించారు.

Updated Date - 2022-12-07T00:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising