ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటి వెలుగు విజయవంతానికి ప్రణాళిక

ABN, First Publish Date - 2022-12-07T00:30:16+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశీరావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 6: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశీరావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటి వెలుగుపై సమీక్షించారు. జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని మంత్రి సూచించారు. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు కొనసాగించడం జరిగిందని ఈ సారి వంద పనిదినాలల్లో పూర్తిచేసేలా సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సెలవులు మినహాయిస్తే సుమారు ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంద న్నారు. గతంలో కంటే ఈ సారి అదనంగా 1500 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. శిబిరాల నిర్వహణకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. శిబిరాల నిర్వహణకు అవసరమైన సామగ్రితో పాటు రీడింగ్‌ అద్దాలను ముందుగానే జిల్లాకు పంపిస్తామని శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించిన రోజునే అవసరమైన వారికి రీడింగ్‌ అద్దాలు అందజేయాలన్నారు. దూరదృష్టి ఉన్నవారి వివరాలను సంబందిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని పక్షం రోజులలోపు వివరాలకు అను గుణంగా అవసరమైన అద్దాలను జిల్లాలకు పంపించేలా ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూ.200 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి..

జనవరి 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు శిబిరాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కోరారు. ఈమేరకు మున్సిపల్‌పట్టణాలు, గ్రామాలల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని బృందంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌ ఒక ఆప్టోమెట్రిస్ట్‌, డేటా ఎంట్రి ఆపరేటర్‌, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశా వర్కర్లు ఉంటారన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో 118 మందికి, అర్బన్‌ పరిధిలో 110 మందికి ఒక బృందం స్ర్కీనింగ్‌ నిర్వహిస్తుందని జిల్లావ్యాప్తంగా 8 లక్షలకు పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీసీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డీపీవో జయసుధ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising