అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయం
ABN, First Publish Date - 2022-08-04T06:14:33+05:30
గ్రామీణ నేపథ్యం కలిగిన తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పార్థసారఽథి అన్నారు. బుధవారం నగరంలోని వంశీహోటల్‌లో తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ర్టాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మూడు రోజులుగా నిర్వహించిన అల్ర్టాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్‌ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటర్‌నేషనల్ సెమినార్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పార్థసారథి
నిజామాబాద్‌అర్బన్, ఆగస్టు 3: గ్రామీణ నేపథ్యం కలిగిన తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పార్థసారఽథి అన్నారు. బుధవారం నగరంలోని వంశీహోటల్‌లో తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ర్టాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మూడు రోజులుగా నిర్వహించిన అల్ర్టాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్‌ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటర్‌నేషనల్ సెమినార్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిజిక్స్ రంగం ద్వారా ప్రపంచం ముందుకెళ్తుందని బయోలజీ, బయోఇన్, ఫార్మాటిక్స్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. వివిధ దేశాల నుంచి శాస్త్ర విజ్ఞాన రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరై ఓరల్, పోస్టల్ ప్రదర్శనలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆల్గారిజం-ఏ ప్రాధాన్యాన్ని వివరించారు. 2గంటల్లో ఒక ఇంటర్‌నేషనల్ ఆర్టికల్‌ను రచించగలుగుతున్నామంటే అది ఆర్గారిజం-ఏ వల్లే సాధ్యమవుతుందన్నారు. త్రీడి ప్రిటింగ్ రంగంలో అద్భుతమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఫిజిక్స్ రంగంలో అల్ర్టాసోనిక్స్, సూపర్‌సోనిక్స్,హైపర్ సోనిక్స్ వంటివి ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందన్నారు. అల్ర్టాసోనిక్స్‌లోభారతదేశం 3వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. వీసీ రవీందర్‌గుప్తా మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అల్ర్టాసోనిక్స్, మెటీరియల్ సైన్స్‌పై నూతన ఆవిష్కరణలు జరిగాయన్నారు. నానోసైన్సెన్, టెక్నాలజి, కెమికల్ సింథసైజ్, బోటని, జూవాలజీ తదితర సబ్జెక్టులలో మెటీ రియల్ సైన్స్ ఉందన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు ఒక్కో శస్త్ర రంగంలో తమ ప్రాజెక్టుల వివరాలు వివరించారు. ఉదయం నిర్వహించిన సదస్సులో అమెరికా నుంచి విచ్చేసిన రోవన్ యూనివర్సిటీ కెమిస్ర్టి, బయో కెమిస్ర్టి ప్రొఫెసర్ రామానుజ చారి, నీల్‌ముచాలు సైన్స్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రర్ శివశంకర్, ప్రిన్సిపాల్ హారతి, అల్ర్టాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి యుదిస్టార్, చంద్రశేఖర్ వాసం పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:14:33+05:30 IST