ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నల్‌ రాదు.. రిజిస్ర్టేషన్లు కావు!

ABN, First Publish Date - 2022-01-28T04:32:14+05:30

రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో భూముల కొనుగోళ్లతో పాటు పౌతి రిజిస్ర్టేషన్ల దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా వచ్చాయి.

నిజాంసాగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధరణి సిగ్నల్‌లో అంతరాయం

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతుల పడిగాపులు

కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న రిజిస్ర్టేషన్ల ఫైళ్లు


నిజాంసాగర్‌, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో భూముల కొనుగోళ్లతో పాటు పౌతి రిజిస్ర్టేషన్ల దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. సిగ్నల్‌ రాకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద రైతులు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నా రెవెన్యూ అధికార యంత్రాంగం ససేమిరా అనడం గమనార్హం. జిల్లాలోని 22 మండల సబ్‌ రిజిస్ర్టార్‌లలో దాదాపు 2500పైగా రిజిస్ర్టేషన్ల దరఖాస్తులు వచ్చాయి. కానీ, దరఖాస్తులు తహసీల్‌ కార్యాలయంలోనే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. సిగ్నల్‌ లేకపోవడంతో ఆయా సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులు రిజిస్ర్టేషన్లు చేయలేకపోతున్నారు. మీ సేవ ద్వారా స్లాబ్‌లు బుక్‌ చేసుకున్న రైతులు కార్యాలయాల ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. మరికొంత మంది రైతులు రిజిస్ర్టేషన్లు చేసుకునేందుకు మీసేవలో స్లాబ్‌ బుక్‌లు చేయించుకునేందుకు వెళ్లినప్పటికీ ధరణి సిగ్నల్‌ లేని కారణంగా మీసేవల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ర్టేషన్‌ ఫీజులను పెంచుతున్నందున మండలాల్లో కుప్పలు కుప్పలుగా రిజిస్ర్టేషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మూడు రోజుల కిందట రిజిస్ర్టేషన్ల కోసం మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు ఫిబ్రవరి 1 వరకు రిజిస్ర్టేషన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, రిజిస్ర్టేషన్ల ఫీజును పెంచితే దరఖాస్తు చేసుకున్న రైతుల భవితవ్యం ప్రశ్నార్థకమే. పెంచిన రిజిస్ర్టేషన్లు పాత రిజిస్ర్టేషన్ల స్లాట్‌ ప్రకారమే రిజిస్ర్టేషన్ల ఫీజు పెంచినా జనవరి లో బుకింగ్‌ అయిన స్లాట్‌లను పాత రేట్లకే అనుగుణంగా రిజిస్ర్టేషన్లు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ప్రభుత్వం రిజిస్ర్టేషన్ల ఫీజు పెంచుతూ వస్తుండటంతో రిజిస్ర్టేషన్ల ఫీజుతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉంది. కానీ, కొనుగోళ్లు, అమ్మకాలు చేసే రైతులకు భారంగా మారనుంది.

Updated Date - 2022-01-28T04:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising