ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad జిల్లా: హత్యకు సుపారీ ఇచ్చిన కేసులో ముగ్గురి Arrest

ABN, First Publish Date - 2022-06-27T21:08:28+05:30

హత్య చేయాలని సుపారీ ఇచ్చిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ (Nizamabad) జిల్లా: ఇద్దరు వ్యక్తులను హత్య చేయాలని సుపారీ (Supari) ఇచ్చిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడిగా నందిపేట్ మండలం, లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ (Mahender), A2, A3గా మహేందర్ అనుచరులు అక్బర్ (Akbar), ఉస్మాన్‌ (Usman)లను అరెస్ట్ చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ అరవింద్ బాబు (Aravind Babu) వెల్లడించారు. పక్క సాక్ష్యాధారాలతో అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.


నందిపేట మండలం, లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాజకీయంగా అడ్డు వస్తున్నారని తన ప్రత్యర్థులు ప్రస్తుత ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రసాద్ రావులను చంపేందుకు ఆయన కుట్ర పన్నారు. 10 లక్షల రూపాయలతో మహారాష్ట్ర గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుపారీ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ పరారవ్వగా ఆయన కోసం పోలీసులు గాలించి పట్టుకుని అరెస్టు చేశారు.

Updated Date - 2022-06-27T21:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising