జిల్లాలో కొత్త సంవత్సర సందడి
ABN, First Publish Date - 2022-12-31T23:24:52+05:30
జిల్లాలో కొత్త సంవత్సరం సందడి నెలకొంది. శనివారం రాత్రి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లాలోని యువత, ప్రజలు సిద్ధమయ్యారు.
- కిటకిటలాడిన స్వీట్ హోమ్‌లు, హోటల్స్, బేకరీలు, వైన్సులు
- ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకున్న వ్యాపారులు
కామారెడ్డి టౌన్, డిసెంబరు 31: జిల్లాలో కొత్త సంవత్సరం సందడి నెలకొంది. శనివారం రాత్రి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లాలోని యువత, ప్రజలు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో బేకరీలు, వైన్సులు, స్వీట్ హోమ్‌లు, హోటల్స్ వద్ద సందడి నెలకొంది. హోటళ్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లతో సందడి చేశారు. ఫ్యామిలీ ప్యాక్‌తో హోటళ్ల నిర్వాహకులు ఒకరి కంటే ఒకరు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్శించారు. అలాగే స్వీట్ హోములు, బేకరీల నిర్వాహకులు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ప్రజలు ఎంతో జోష్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రత్యేక మందు, విందుతో కేరింతలతో జల్సాగా ఉత్సహంతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2023 కొత్త సంవత్సరం సందర్భంగా వ్యాపారాలు కలిసి వస్తాయని భావించిన హోటల్స్, స్వీట్ హోమ్‌లలో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొత్త సంవత్సరంను స్వాగతిస్తూ నేడు సందడి చేయనున్నారు. వాట్స్‌ప, ఫేస్‌బుక్ వినియోగదారులు రాత్రి వేళల్లో తమ సందేశాన్ని మిత్రులకు పంపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2022-12-31T23:24:54+05:30 IST