ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద కాలువకు ఇరువైపులా హద్దుల గుర్తింపు

ABN, First Publish Date - 2022-06-25T05:27:43+05:30

మండలానికి కేంద్రమైన మోర్తాడ్‌ శివారులోని వరద కాలువ ఇరువైపులా నీటి పారుదల, రెవెన్యూ అధి కారులు హద్దులను నిర్వహి స్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోర్తాడ్‌, జూన్‌ 24 : మండలానికి కేంద్రమైన మోర్తాడ్‌ శివారులోని వరద కాలువ ఇరువైపులా నీటి పారుదల, రెవెన్యూ అధి కారులు హద్దులను నిర్వహి స్తున్నారు. శుక్రవారం రెండు శాఖల సిబ్బంది వరదకాలు వ పక్కన కొలతలు చేప ట్టారు. వరదకాలువ ఇరు వైపులా హరితహారం మొ క్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కాగా గతంలో వరదకాలువకు భూములు ఇచ్చిన రైతులు మొరాన్ని తీయించి పంటలను పండించుకుంటున్నారు. పంటలు పండించుకుంటున్న భూమిని అధికారులు కొలతలు చేపట్టడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం తక్కువ ధరకే భూములకు ధర నిర్ణయించిందని రైతులు వాపోయారు. ప్రస్తుతం రైతులు వరదకాలువ పక్కన భూములను చదును చేయించుకొని పంటలు పండించుకుంటున్నారు. తమ భూమిని అధికారులు తీసుకోవద్దని రైతులు కోరుతున్నారు. 

లక్ష్మికాలువ హద్దులు ఏర్పాటు 

ముప్కాల్‌, జూన్‌24: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు లక్ష్మి కాలువకు ఇరువైపులా శుక్రవారం ఎంపీడీవో దామోదర్‌, తహసీల్దార్‌ రోజా, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి హద్దులను ఏర్పాటు చేశారు. లక్ష్మి కాలువకు ఇరువైపులా పంటలు వేయరాదని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఏర్పాటు చేసిన హద్దులకు సంబంధించి రికార్డులో నుంచి తొలించారు. దాని ప్రకారం రైతులు హద్దులను వదిలి పంటలు వేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-25T05:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising