ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పందెం’కోడిపై నజర్‌

ABN, First Publish Date - 2022-01-14T06:08:16+05:30

జిల్లాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలు, పేకాటపై పోలీసులు నజర్‌పెట్టారు. జూదరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోడి పందేలు, పేకాటపై పోలీసుల దృష్టి    

స్టేషన్‌ల వారీగా వివరాల సేకరణ 

జిల్లా వ్యాప్తంగా పోలీసుల నజర్‌

నిజామాబాద్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలు, పేకాటపై పోలీసులు నజర్‌పెట్టారు. జూదరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ముందస్తుగానే సమాచారం సేకరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కోడి పందేలు, పేకాట నిర్వహించిన వారి వివరాలను సేకరించడంతో పాటు బైండోవర్‌ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని గ్రామాల పరిధిలో నిఘాను పెంచారు. జిల్లాలో కొన్నేళ్ల పాటు బోధన్‌ డివిజన్‌ పరిధిలోని వర్ని, కోటగిరి, రుద్రూర్‌, డిచ్‌పల్లి, నిజామాబాద్‌రూరల్‌ మండలాల పరిధిలో వీటిని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడంతో పాటు పెద్దఎత్తున పందేలను కాసేవారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు బీర్కూర్‌, బాన్సువాడ వరకు వీటిని నిర్వహించారు. డబ్బులు ఎక్కువ మొత్తంలో చేతులు మారడం, కోళ్ల పందేలను విలాసంగా నిర్వహించడంతో పోలీసులు దాడులు చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా పందేలు, పేకాట తగ్గుముకం పట్టింది. కొన్నేళ్లు అటవీ ప్రాంతాల్లో కూడా కోడి పందేలను నిర్వహించారు. కోళ్లను కూడా ఇతర ప్రాంతాల్లోంచి తీసుకువచ్చి పందేలను నిర్వహించేవారు. ఈ కోడి పందేలతో పాటు అన్ని గ్రామాల పరిధిలో పేకాట కూడా ఎక్కువగా ఆడేవారు. పోలీసుల వరుస దాడులు, కేసులు నమోదు చేయడంతో తగ్గుతూ వచ్చాయి. పండుగ పేరున అందరు ఒకేదగ్గర ఉండడం, ఈ రెండు ఎక్కువగా బోధన్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహించేవారు. 

ఫ జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిఘా.. 

జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు గట్టిగా నిఘా పెట్టడంతో గడిచిన కొన్నేళ్లుగా జరగడంలేదు. ఎక్కడైనా ప్రయత్నాలు చేసినా పోలీసులు ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపడుతుండడంతో రానురాను తగ్గుతూ వచ్చాయి. నగర సీపీ కేఆర్‌.నాగరాజు ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో చర్యలకు సిద్ధమయ్యారు. గతంలో నిర్వహించిన గ్రామాల వారికి ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. పాత కేసుల ఆధారంగా కొంతమందిని బైండోవర్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు, పేకాటను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటశ్వర్‌ తెలిపారు.

Updated Date - 2022-01-14T06:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising