ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవ్యవస్థకు న్యాయవాదులు పునాదులు

ABN, First Publish Date - 2022-03-06T04:57:47+05:30

న్యాయవ్యవస్థకు న్యాయవాదులే పునాదులని, సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్‌ విజయసేనారెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైకోర్టు జడ్జి జస్టీస్‌ విజయసేనారెడ్డి

కామారెడ్డి, మార్చి 5: న్యాయవ్యవస్థకు న్యాయవాదులే పునాదులని, సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్‌ విజయసేనారెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు పోలీసు గౌరవవందనం స్వీకరించి కోర్టు ప్రాంగణాన్ని కలెక్టర్‌ జితేష్‌వి.పాటిల్‌, జస్టిస్‌ సుభాష్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జడ్జిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు జడ్జి రమేష్‌బాబు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి, మొబైల్‌కోర్టు మేజిస్ట్రేట్‌ వెంకటేష్‌, ఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్‌పీ అనోన్య, డీఎస్‌పీ సోమనాఽథం, జిల్లా కోర్టు బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు భిక్షపతి, న్యాయవాదులు రామచంద్రరెడ్డి, జగన్నాథం, శంకర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, నందరమేష్‌,నిమ్మదామోదర్‌రెడ్డి, గంగాధర్‌, శ్రీకాంత్‌గౌడ్‌, దేవేందర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising