ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీపై నిఘా కరువు

ABN, First Publish Date - 2022-05-02T05:55:06+05:30

బియ్యం పిండికి రంగు కలిపితే అది పసుపు.. పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు.. అరటికాడ గుజ్జుతో అల్లం వెల్లులి పేస్టు.. రసాయనాలు రుద్దితే నిగనిగలాడే పండ్లు.. నాణ్యతలేని నూనెతో బిర్యానీ, నుడుల్స్‌, నాన్‌ వెజ్‌ వేపుళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీ కలర్‌ పూసుకున్న తినుబండారాలను నోరూరించుకుంటూ తింటున్నాం.

కల్తీ నూనెలతో తయారు చేస్తున్న తినుబండారాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు

- వాటినే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వినియోగం

- పెరిగిన ధరలు.. హోటల్‌ కల్చర్‌తో జోరుగా కల్తీ

- నూనె, పాలు, పండ్లు కూడా అతీతం కాదు


కామారెడ్డి, మే 1: బియ్యం పిండికి రంగు కలిపితే అది పసుపు.. పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు.. అరటికాడ గుజ్జుతో అల్లం వెల్లులి పేస్టు.. రసాయనాలు రుద్దితే నిగనిగలాడే పండ్లు.. నాణ్యతలేని నూనెతో బిర్యానీ, నుడుల్స్‌, నాన్‌ వెజ్‌ వేపుళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీ కలర్‌ పూసుకున్న తినుబండారాలను నోరూరించుకుంటూ తింటున్నాం. ఇదంతా ఎక్కడో కాదు.. జిల్లా అంతటా విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ సరుకుల దందా, జీరో దందాలో ఆహార సరుకులు తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కొందరు వ్యాపారులు. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు కల్తీ వస్తువులు మార్కెట్లను ముంచెతుతున్నాయి.

తనిఖీలు లేవు.. నమూనాల సేకరణ లేదు

ఫుడ్‌ ఇన్స్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి ర్యాండమ్‌గా నమూనాలు తీయాలి. టీ పొడి నుంచి పాల వరకు ఇలా ప్రతీ ఒక్కదానిపైనా నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం, తనిఖీలు చేయడం చేపట్టాలి. ఈ క్రమంలో నెలకు కనీసం 12 నమూనాలు తీసి ఎఫ్‌ఎస్‌ఎల్‌(ఫుడ్‌ సేఫ్టీ ల్యాబోరేటరీకి) పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఫిర్యాదులు వెల్లువెత్తిన సమయంలో మినహా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆడపాదడపా నమూనాలు సేకరించినా వాటి ఫలితాలు వచ్చేసరికి కేసు నీరు గారిపోతుంది.

పెరిగిన హోటల్‌ కల్చర్‌

జిల్లాలో హోటల్‌ కల్చర్‌ పెరుగుతోంది. ఉద్యోగులు మొదలుకొని రోజు వారి కూలీల వరకు వివిధ పనులపై బయటకు వెళ్లినప్పుడు అవసరాన్ని బట్టి టిఫిన్‌, భోజనం కోసం హోటళ్లు, రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా ఫాస్ట్‌ఫుడ్‌ తినేవారు సైతం ఎక్కువవుతున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో కల్తీ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా చోట్ల కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రంగులను కలుపుతూ క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నారు. మరికొంత మంది అయితే మాంసం విక్రయాలు చేసే వారితో భేరం కుదుర్చుకుని రోగంతో చనిపోయిన, గాయాలపాలైన వాటిని సైతం తక్కువ ధరకు తీసుకుని వంటకాలు చేస్తున్నారు. పలువురు హోటల్‌ నిర్వాహకులు, వ్యాపారులు తక్కువ ధరకు వస్తుందని కల్తీ పదార్థాలతోనే వంటలు చేసి ప్రజలకు అంటగడుతున్నారు.

ఆహార సలహా సంఘాల ఊసేది?

వినియోగదారులను మోసాల భారి నుంచి రక్షిస్తూ వారిలో చైతన్యం నింపేందుకు గతంలో ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ఈ సంఘాల సభ్యులు కల్తీలు, మోసాలను అరికట్టేందుకు మూడు నెలలకొకసారి అధికారులతో సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. అధికారుల నిఘా కొరవడి, వీటి ఏర్పాటును సైతం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Updated Date - 2022-05-02T05:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising