తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN, First Publish Date - 2022-09-28T05:45:55+05:30
తెలంగాణ ఉద్యమ రూపకర్త, తెలంగాణ సాయిధ పోరాటయోధుడు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కమ్మర్‌పల్లిలో రూ.5 కోట్లతో మంజూరైన జాతీయ రహదారి వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
కమ్మర్‌పల్లి, సెప్టెంబరు 27: తెలంగాణ ఉద్యమ రూపకర్త, తెలంగాణ సాయిధ పోరాటయోధుడు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కమ్మర్‌పల్లిలో రూ.5 కోట్లతో మంజూరైన జాతీయ రహదారి వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా వివిధ శాఖలకు చెందిన నిధులతో కమ్మర్‌పల్లిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘభవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ తొలినాళ్లలో హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ పార్టీకి కార్యాలయం పెట్టుకునేందుకు తన ఇంటిని ఇచ్చిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయ నపై ఉన్న గౌరవంతోనే రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. అంతకు ముందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు.
మంత్రికి గజమాలతో స్వాగతం
కమ్మర్‌పల్లి రహదారి వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనుల శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి టీఆర్‌ఎస్ నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ గౌతమి, పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీలు, సర్పంచులు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషిచేయాలి..
నిజామాబాద్ అర్బన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలసిన ఆణిముత్యం అని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సా గాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, మేయర్ నీతుకిరణ్, అదనపు కలెక్టర్‌లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్, వివిధ సంఘాల ప్రతినిధులు కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతకముందు వినాయక్‌నగర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మశాలీలు, బీసీ సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
Updated Date - 2022-09-28T05:45:55+05:30 IST