ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: 43 గంటల పాటు నరకయాతన..

ABN, First Publish Date - 2022-12-15T18:53:55+05:30

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, సింగరాయిపల్లి (Singaraipally) శివారులోని అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి పులిగుట్ట గుహలో చిక్కుకుపోయిన షాడ రాజు (Raju) ఎట్టకేలకు ప్రాణాలతో బయట పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, సింగరాయిపల్లి (Singaraipally) శివారులోని అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి పులిగుట్ట గుహలో చిక్కుకుపోయిన షాడ రాజు (Raju) ఎట్టకేలకు ప్రాణాలతో బయట పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి (SP Srinivas Reddy) పర్యవేక్షణలో పోలీసు, అటవీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి.. రాజును రక్షించారు. వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుని 43 గంటల పాటు నరకయాతన అనుభవించిన యువకుడు రాజు మృత్యువును జయించాడు.

రాజు, మహేష్‌తో కలిసి ఈ నెల 13వ తేదీన అటవీ జంతువుల వేట కోసం సింగరాయిపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో పులిగుట్ట నుంచి వెళ్తుండగా రాజు సెల్‌ఫోన్‌ రాళ్లబండ గుహలో పడిపోయింది. దానిని తీయడానికి రాజు గుహలోకి దిగాడు. సెల్‌ఫోన్‌ తీసుకుని పైకి వస్తుండగా అతని కుడిభుజం రాళ్లమధ్యలో ఇరుకుపోవడంతో బయటకు రాలేక పోయాడు. దీన్ని గమనించిన మహేష్‌ రాత్రంతా అక్కడే ఉండి రాజును బయటకు తీసే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులకు గ్రామస్తులకు తెలపడంతో వారంతా ఘటన స్థలానికి వెళ్లి రాజును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం అర్థరాత్రి వరకు పోలీసులు రెవెన్యూ, అగ్నిమాపక, అటవీశాఖల అధికారులు జేసీబీల సహాయంతో రాళ్లను పగలగొట్టి రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ.. లాభం లేకుండా పోయింది.

గురువారం మధ్యాహ్నం వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూ వచ్చింది. రాజు గుహలో తలకిందులుగా ఇరుకుపోవడం శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం, రెండురోజుల పాటు ఎలాంటి ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చాడు. ఎలాంటి ఆహారం, నీటిని తీసుకోకపోవడంతో నిరసించిపోయాడు. రాజును గుహలోంచి బయటకు తీసేందుకై పక్కనే ఉన్న బండరాళ్లను జేసీబీ, డ్రిల్లింగ్‌ మిషన్‌లతో పగలగొట్టె సమయంలో బండ రాళ్లు కదిలి శరీరానికి ఒత్తుకు పోతూ వచ్చాయి. దీంతో రాజు ఆ గుహలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా ఉంటూ వచ్చాడు. ఇదే క్రమంలో పోలీసులు, వైద్యులు రాజుకు వేరే మార్గం నుంచి నీరు, ఓఆర్‌సీ తాగించే ప్రయత్నం చేశారు. ఆక్సిజన్‌ను అందిస్తూ అతడికి ధైర్యం చెబుతూ వచ్చారు. చివరకు బండరాళ్లు పగలగొట్టె జిలెటిన్ స్టిక్‌ బాంబులు పెట్టి గుహ బండలను పగలగొట్టారు.

అనంతరం డ్రిల్లింగ్‌మిషన్‌ ద్వారా రంధ్రాలు చేస్తు రాజును బయటకు తీసే ప్రయత్నం చేశారు. బండరాళ్ల నుంచి జారిపడేందుకై కొబ్బరి నూనెను కూడా వాడారు. అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేసి చివరకు రాజును క్షేమంగా బయటకు తీశారు. అనంతరం అతడిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తాను ప్రాణాలతో బయటపడుతానో లేదోనని రాజు ఆసుపత్రిలో ఆవేదనతో చెప్పుకొచ్చాడు. 24 గంటల పాటు అధికారులు, గ్రామస్తులు కష్టపడి తనను బయటకు తీసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-12-15T18:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising