గిరిజనుల వారసత్వాలను కాపాడుతోంది తెలంగాణ ప్రభుత్వమే: జాజాల
ABN, First Publish Date - 2022-03-05T05:58:01+05:30
గిరిజనులకు గుర్తింపునిచ్చి, సంస్కృతి, వారసత్వాలను కాపాడుతోంది తెలంగాణ ప్రభుత్వమేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
లింగంపేట, మార్చి 4: గిరిజనులకు గుర్తింపునిచ్చి, సంస్కృతి, వారసత్వాలను కాపాడుతోంది తెలంగాణ ప్రభుత్వమేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శుక్రవారం మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల కు చెందిన గిరిజనులతో నిర్వహించిన సేవాలాల్ జయంతికి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుం టున్నాయని సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్రంలోని గిరిజనులకు గుర్తింపునిచ్చి తం డాలన్నింటిని గ్రామపంచాయతీలుగా చేసి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతీ తండాలో పూర్తి స్థాయిలో సీసీరోడ్లు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనుల భూ సమస్య లు పరిష్కరిస్తానన్నారు. ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతనే సేవాలాల్ జయంతిని పండుగలా జరుపుతున్నారని ఆయన తెలిపా రు. సేవాలాల్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేందుకు పార్లమెంటు సమా వేశాల్లో మాట్లాడుతానని, లింగంపేటలో అసంపూర్తిగా ఉన్న బంజారాసేవా సం ఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి అందజేస్తామన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్, పార్ల మెంట్‌లో ఏర్పాటు చేయాలని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్ కోరారు. గిరిజనులకు చట్టసభల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనునాయక్, ఎంపీపీ గరీబున్నీసా, జెడ్పీటీసీ శ్రీలత తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-03-05T05:58:01+05:30 IST