‘దళితబంధు ఎంపికలో ఎల్లారెడ్డి మండల వాసులకు అన్యాయం’
ABN, First Publish Date - 2022-03-06T04:57:05+05:30
మండలంలోని 31 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీపీ మాదవి అన్నారు.
ఎల్లారెడ్డి, మార్చి 5: మండలంలోని 31 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీపీ మాదవి అన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలో కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఎమ్మెల్యే సమానంగా చూడాలని, లింగంపేట మండలానికి చెందిన ఎక్కువ మంది దళితులను దళితబంధు పథకానికి ఎంపిక చేయడంపై ఎల్లారెడ్డి మండల దళితులు నిరాశకు గురయ్యారని ఆరోపించారు. వారి కార్యకర్తలకు మాత్రమే ఎంపిక చేయడంతో నిరుద్యోగులుగా ఉన్న దళితుల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలని, ఎమ్మె ల్యే సురేందర్ మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేయడం తగదని అన్నారు. ఇకనైనా దళితబంధు ఎంపిక పారదర్శకంగా ఎంపిక చేయకపోతే దళితులతో కలిసి ఉద్యమిస్తామని ఆమె తెలిపారు.
Updated Date - 2022-03-06T04:57:05+05:30 IST