ఘనంగా వాక్-వాక్-వాక్ ఫర్ యూనిటీ ర్యాలీ
ABN, First Publish Date - 2022-12-16T01:21:50+05:30
నైజాం పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లను పురస్కరించుకుని నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ సమితి గురువారం నిర్వహించిన వాక్-వాక్-వాక్ ఫర్ యూనిటీ ర్యాలీ ఘనంగా సాగాంది.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు, విద్యార్థులు, మేధావులు
నిజామాబాద్ కల్చరల్, డిసెంబరు 15: నైజాం పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లను పురస్కరించుకుని నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ సమితి గురువారం నిర్వహించిన వాక్-వాక్-వాక్ ఫర్ యూనిటీ ర్యాలీ ఘనంగా సాగాంది. హైదరాబాద్ సంస్థానం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన 75 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పాత కలెక్టర్ మైదానంలో జెండాను ఆవిష్కరించి జా తీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మై దానం నుంచి ర్యాలీ సర్దార్ వల్లభాయ్ పటే ల్ జోహార్ అంటూ ర్యాలీని నిర్వాహకులు ప్రారంభించారు. ర్యాలీ శాస్త్రీచౌక్, పెద్దబస్టాండ్, భగత్‌సింగ్ చౌరస్తా, నెహ్రూపార్కు, పెద్దబజార్, రాజరాజేంద్ర శివాజీచౌక్ మీదుగా వర్ని రోడ్ వద్ద గల సర్దార్‌వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు సాగింది. దారి పొడవునా యువకులు, విద్యార్థులు, మేధావులు, సాహితీవేత్తలు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విలీనం లో చేయడానికి చేసిన కృషిని నినాదాలతో హోరెత్తించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాకు చేరుకున్న ర్యాలీకి సమితి సభ్యు లు ఘనంగా స్వాగతం పలికారు. సర్దార్ వ ల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. యువకుల, విద్యార్థుల సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్‌హై అనే నినాదాలతో చౌరస్తా మారుమోగిపోయింది.
పటేల్ సేవలు మరువలేనివి ..
స్వతంత్ర భారత దేశాన్ని విశాల భారతదేశంగా ఏకీకృతం చేయడంలో ఆనాటి భారతదేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌చేసిన సేవలు మరువలేనివని నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ సమితి అధ్యక్షుడు సోమాని అన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు మరికొన్ని అఖండ భారతదేశంలో కలవగా నైజాం రాజు మాత్రం హైదరాబాద్ స్టేట్ తెలంగాణ కలపడానికి ఒప్పుకోలేదని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సంప్రదింపులు, ఒప్పందాలతోనే భారతదేశంలో కలవడం జరిగిందని అన్నారు. జిల్లాకు చెందిన ఎందరో తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారందరికి కూడా నివాళ్లు అర్పించడంతో పాటు వారిని భావితరాల వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:21:51+05:30 IST