ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ రోడ్డు మరమ్మతులకు నిధుల మంజూరు

ABN, First Publish Date - 2022-01-29T05:53:10+05:30

నియోజకవర్గంలో గ్రామీణ రూరల్‌ రహదారులకు గుంతలమయమైన బీటీ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ, జనవరి 28: నియోజకవర్గంలో గ్రామీణ రూరల్‌ రహదారులకు గుంతలమయమైన బీటీ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. బాన్సువాడ మండలంలో ఆర్టీసీ బస్‌ డిపో నుంచి బోర్లం క్యాంపు వరకు రూ.37లక్షలు, తిర్మలాపూర్‌ ఆర్‌అండ్‌బీ మెయి న్‌ రోడ్డు నుంచి తిర్మలాపూర్‌ గ్రామం వరకు రూ.16లక్షలు, ఆర్‌అండ్‌బీ నుంచి సంగోజిపేట్‌ గ్రామం వరకు రూ.20 లక్షలు, ఆర్‌ అండ్‌ బీ మెయిన్‌ రోడ్డు నుంచి సోమ్లా నాయక్‌ వరకు వయా గోపాల్‌ తండా మీదుగా రూ.33లక్షలు, బీర్కూర్‌ మండలంలోని బీర్కూర్‌ నుంచి మల్లాపూర్‌ వరకు రూ.47లక్షలు, నస్రుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌ పల్లి చౌరస్తా నుంచి నెమ్లి గ్రామం వరకు రూ.45 లక్షలు, కోటగిరి మండలంలోని పోతంగల్‌ బీర్కూర్‌ మెయిన్‌ రోడ్డు నుంచి వయా కల్లూర్‌ మీదుగా కొడిచర్ల వరకు రూ.90 లక్షల మంజూరైనట్లు తెలిపారు. అలాగే రుద్రూ రు నుంచి చిక్కడ్‌పల్లి గ్రామం వరకు అప్రోచ్‌ రోడ్డుకు రూ.20 లక్షల, వర్ని మండ లంలోని వకీల్‌ ఫారం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జలాల్‌పూర్‌ వరకు వయా శంకోరా, రాజ్‌పేట్‌ గ్రామాల మీదుగా ఒక కోటి 24లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వివరించారు.

Updated Date - 2022-01-29T05:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising