వల చుట్టుకుని మత్స్యకార్మికుడి మృతి
ABN, First Publish Date - 2022-03-05T05:55:30+05:30
మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చేపల వేటకు వెళ్లగా చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి ఓ మత్స్యకార్మికు డు మృతిచెందాడు.
నిజాంసాగర్, మార్చి 4: మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చేపల వేటకు వెళ్లగా చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి ఓ మత్స్యకార్మికు డు మృతిచెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన కొత్తపేట పోచయ్య (62) శుక్రవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేపల వేటకు వెళ్లా డు. తెప్ప పైనుంచి కాళ్లు నీటిలో ఉండటంతో కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. పోచయ్య మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. భార్య దుర్గవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ అహ్మద్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బాన్సువా డకు తరలించారు. మృతునికి కాశీరాం, గంగారాం కుమారులున్నారు.
Updated Date - 2022-03-05T05:55:30+05:30 IST