రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
ABN, First Publish Date - 2022-03-06T05:04:29+05:30
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందజేసి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదుకోవాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌రూరల్, మార్చి5: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందజేసి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదుకోవాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో రైతు పాదయాత్ర చేస్తున్న నాయకులు, రైతులకు శనివారం సం ఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం రైతులకు వంత పాడుతూ హామీలు ఇస్తున్నారని, వాటిని అమలు చేయడం లేద న్నారు. ఇటీవల ఢిల్లీలో రైతుల ఉద్యమం చూశామని, రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, రైతుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. రైతులు ఐక్యంగా పోరాడి సమస్యలు పరిష్కరిం చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి రంగారావు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు వి.ప్రభాకర్, దేవారాం, దేగాం యాదాగౌడ్, మహేందర్‌రెడ్డి, మంథని గంగారాం, జక్క లింగారెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:04:29+05:30 IST