ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరుగు తీయొద్దని రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-05-19T05:47:42+05:30

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచమర్రి వద్ద రైస్‌మిల్లర్లు తరుగు తీయొద్దని రైతులు రాస్తారోకో నిర్వహించారు.

పల్వంచమర్రి వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచారెడ్డి, మే 18: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచమర్రి వద్ద రైస్‌మిల్లర్లు తరుగు తీయొద్దని రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు బుధవారం నినాదాలు చేస్తూ కామారెడ్డి-రాజన్న సిరిసిల్లా జిల్లాలను కలిపే 11వ రాష్ట్ర రహదారిపై రైతులు బైఠాయించారు. వారు మాట్లాడుతూ 42 కిలోలను కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయగా తూకం వేసిన బస్తాలను రైస్‌మిల్లుకు పంపగా మరో రెండు కిలోలు అదనంగా తరుగు తీస్తేనే కొనుగోలు చేస్తానని ఆరేపల్లి గ్రామ సమీపంలో గల షైవి రైస్‌మిల్లు యజమాని తెలిపాడన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఒక బస్తా ధాన్యం వెనుక 3 నుంచి 4 కిలోల తరుగు తీస్తుండడంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయన్నా రు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటు రైస్‌మిల్లర్లు తరుగు పేరిట కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగిం ది. విషయం తెలుసుకు న్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. అలాగే తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో రైతులతో మాట్లాడించారు. గురువారం రైస్‌మిల్లు యజమానితో మాట్లాడి లోడ్‌ ఖాళీ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2022-05-19T05:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising