ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ పోలీసు అరెస్టు

ABN, First Publish Date - 2022-01-24T05:46:30+05:30

జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీ రోడ్డులో శనివారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన పోశెట్టిని ఓ వ్యక్తి పోలీసునని చెప్పి శ్రీరాంనగర్‌ కాలనీలో చోరీలు జరుగుతున్నాయని, చెకింగ్‌ చేయాలని చెప్పి అతని వద్ద నుంచి రూ.2800ల నగదును ఎత్తుకెళ్లిన నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ద్విచక్ర వాహనం, రూ.2500 నగదు స్వాధీనం: ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, జనవరి 23: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీ రోడ్డులో శనివారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన పోశెట్టిని ఓ వ్యక్తి పోలీసునని చెప్పి శ్రీరాంనగర్‌ కాలనీలో చోరీలు జరుగుతున్నాయని, చెకింగ్‌ చేయాలని చెప్పి అతని వద్ద నుంచి రూ.2800ల నగదును ఎత్తుకెళ్లిన నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ పోలీసును రిమాండ్‌కు తరిలించినట్లు పేర్కొన్నారు. బాధితుడు పోశెట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం ఇందిరాచౌక్‌లో పట్టణ ఎస్‌హెచ్‌వో నరేష్‌, ఎస్‌ఐలు రాములు, మధుసూదన్‌గౌడ్‌ వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించగా పట్టుకుని విచారించారని, నేరం ఒప్పుకున్నాడన్నారు. తన పేరు బొజ్జవిష్ణు అలియాస్‌ పోశెట్టి అలియాస్‌ పోశార్ది ఇందిరనగర్‌ కాలనీకి చెందిన వ్యక్తినని చెప్పాడని తెలిపారు. దీంతో అతనిని పట్టుకుని పల్సర్‌ వాహనంతోపాటు రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ తెలిపారు. గతంలో నేరచరిత్ర కూడా ఉందని, ఎల్‌బీనగర్‌, బోయిన్‌పల్లి, వేములవాడ, దేవునిపల్లి, కామారెడ్డి ఏరియాలలో కూడా  నకిలీ పోలీసు వేషధారణలో నేరాలుచేసి జైల్‌కు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.  గత సంవత్సరంలోనే అనుమానస్పద వ్యక్తిగా పోలీసు రికార్డులో నమోదుచేయబడిందని తెలిపారు. అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో సీసీ కెమెరాలు చాలా చోట్ల ఏర్పాటుచేశామని, నేరస్తులు ఎంతటివారైన జిల్లాలో ఎక్కడైన ఎటువంటి నేరాలకు పాల్పడిన సీసీ కెమెరాలతోపాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు ఇన్‌ఫ్మర్‌మేషన్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించి పట్టుకుని చట్ట ప్రకారం తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటన జరిగిన ఆరుగంటలలోనే కేసును చేదించిన కామారెడ్డి ఎస్‌హెచ్‌వో నరేష్‌, ఎస్‌ఐలు రాములు, మధుసూదన్‌గౌడ్‌, ఐడీ పార్టీ కానిస్టేబుల్‌లు రవి, సాయిబాబా, నయూం, సీసీఎస్‌ సిబ్బందిని ఎస్‌పీ అభినందిస్తు రివార్డులు అందజేశారు.

Updated Date - 2022-01-24T05:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising