మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నేడు పరీక్ష
ABN, First Publish Date - 2022-03-06T05:04:52+05:30
రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సంగీత తెలిపారు.
డిచ్‌పల్లి, మార్చి 5: రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సంగీత తెలిపారు. జిల్లాలోని సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, బాలుర పాఠశాల, కళాశా ల(ఆర్మూర్), సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల సుద్దపల్లి, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల (నిజామాబాద్)లో పరీక్ష ఉంటుందని, విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల పరీక్ష ఉంటుందని తెలిపారు. మాస్క్, పెన్ను, ప్యాడ్, హాల్‌టికెట్, ఇంటర్ మొదటి సంవత్సరం మాల్ టికెట్ తీసుకొని రావాలని సూచించారు. ధర్మారం పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ ఏర్పాట్లును ఆర్సీవో మేరి యేసుపాదం పరిశీలించారని సంగీత తెలిపారు.
Updated Date - 2022-03-06T05:04:52+05:30 IST