మాదకద్రవ్యాలను అరికట్టాలి
ABN, First Publish Date - 2022-03-05T06:09:07+05:30
జిల్లావ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఐడీ ఐజీపీ రాజేష్‌కుమార్ ఆదేశించా రు.
ఖిల్లా, మార్చి 4: జిల్లావ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఐడీ ఐజీపీ రాజేష్‌కుమార్ ఆదేశించా రు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులను జిల్లాలో నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ సిబ్బంది, మాదకద్రవ్యాల కేసులు (ఎన్‌డీపీఎస్) వివరాలను, నేరస్తుల సమాచారం, డీవోపీఏఎంఎస్‌లో అప్లికేషన్‌లో ఏవిధంగా అప్‌లోడ్ చేయాలో వివరించారు. అప్‌లోడ్ చేయడం వల్ల వాటి ఉపయోగాన్ని ఆయన వివరించారు. కేసుల వివరాలను లోకల్ పోలీస్ స్టేషన్‌లో అప్‌లోడ్ చే యడంవల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడనుంచైనా ఆన్‌లైన్‌లో పోలీస్ వీక్షించవచ్చని అన్నారు. దీనివల్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టవచ్చని సూచించారు. సమావేశంలో సీపీ కేఆర్.నాగరాజు, అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వినీత్, అదనపు డీసీపీ అడ్మిన్ ఉషావిశ్వనాథ్‌తిరునగరి, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:09:07+05:30 IST