ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN, First Publish Date - 2022-05-18T05:45:21+05:30

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమకొండ, మే 17: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం లింగుపల్లి, దోమకొండ, సంగమేశ్వర్‌ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలుసెంటర్‌లను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని అరబెట్టిన తర్వాత వెంటనే కాంట చేయాలని అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. లారీల సమస్య మిల్లర్ల నుంచి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌, జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌, డీఏవో భాగ్యలక్ష్మీ, తహసీల్దార్‌ శాంత, ఏవో పవన్‌ కుమార్‌, విండో చైర్మన్‌ పన్యాల నాగరాజ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సాయిలు, రాంచంద్రరెడ్డి, సీఈవో బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రక్త దానంతో మరొకరికి ప్రాణ దానం

కామారెడ్డి టౌన్‌: రక్త దానంతో మరొకరికి ప్రాణ దానం చేయవచ్చని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఐవీఎఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన పరిశీలించడంతో పాటు రక్తదానం చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను నిలబెట్టి ప్రాణదాతలుగా మారవచ్చని అన్నారు. అన్ని దానాల కన్న రక్తదానం గొప్పదని తెలిపారు. విద్యార్థులు రక్తదానం చేయడం చిన్నప్పటి నుంచే సామాజిక బాధ్యతగా అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమిల్‌హైమద్‌, కామారెడ్డి రక్తదాతల అధ్యక్షుడు వేదప్రకాష్‌, ఐవీఎప్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌గుప్తా, గోవింద్‌, భాస్కర్‌గుప్తా, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త రామలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising