ప్లాస్టిక్‌ను నియంత్రించరా?
ABN, First Publish Date - 2022-08-04T06:04:39+05:30
ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ నియంత్రణ అమలు కావడం లేదు. పూర్తిగా ప్లాస్టిక్‌ను నియంత్రించాలని, ప్లాస్టిక్‌ను విక్రయించినా, వాడినా జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం జాడ లేకుండా పోయింది. బాన్సువాడ బల్దియాలో జోరుగా ప్లాస్టిక్ విక్రయాలు, వాడకాలు జరుగుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టింపులేనట్లే వ్యవహరిస్తున్నారు.
ఫ బాన్సువాడ బల్దియాలో జోరుగా ప్లాస్టిక్ విక్రయాలు
ఫ కేంద్రం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని అధికారులు
ఫ చర్యలు తీసుకోవడంలో బల్దియా పాలకులు విఫలం
ఫ నామ్‌కే వస్తేగా వ్యాపారులతో సమావేశాల నిర్వహణ
ఫ ఇప్పటికైనా ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టేనా?
బాన్సువాడ/టౌన్, ఆగస్టు 3: ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ నియంత్రణ అమలు కావడం లేదు. పూర్తిగా ప్లాస్టిక్‌ను నియంత్రించాలని, ప్లాస్టిక్‌ను విక్రయించినా, వాడినా జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం జాడ లేకుండా పోయింది. బాన్సువాడ బల్దియాలో జోరుగా ప్లాస్టిక్ విక్రయాలు, వాడకాలు జరుగుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టింపులేనట్లే వ్యవహరిస్తున్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే తూతూమంత్రంగా బల్దియా కార్యాలయాల్లో అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. సమావేశం జరిగి ఇప్పటికీ నెల గడుస్తున్నా వ్యాపారులపై, ఏజెన్సీలపై జరిమానాలు కాని విధించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఇంకా బాన్సువాడలో టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు తదితర అన్ని వ్యాపార సముదాయాల్లో జోరుగా ప్లాస్టిక్ విక్రయాలు, వాడకాలు జరుగుతున్నా బల్దియా అధికారులు మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వేరే ప్రాంతాల్లో ప్లాస్టిక్ నియంత్రణ కట్టుదిట్టం చేసినా ఇక్కడ మాత్రం అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు ప్లాస్టిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా దాడులు చేసినా సంఘటనలు లేవు. దీంతో ప్లాస్టిక్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక వైపు ప్లాస్టిక్ విక్రయించిన వారికి కేంద్రం ఐదు వేల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు కొన్న వారికి రూ.500 జరిమానా విధించాలని ఉంది. ఏజెన్సీ నిర్వాహకులు ఎవరైనా ఉంటే వారికి ఒక లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించాల్సి ఉంది. కానీ బాన్సువాడ బల్దియాలో మాత్రం అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు మాత్రం ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో విఫలం కావడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఉన్న సిబ్బంది మాత్రం తమకేమి ఆదేశాలు రాలేవని, నియంత్రణలో తాము చర్యలు తీసుకోవడం లేదని కొంత మంది అధికారులు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా బాన్సువాడ బల్దియాలో ప్లాస్టిక్ నియంత్రణపై వాడకాలపై బల్దియా అధికారులు దృష్టి పెడతారా లేదా అనే వేచి చూడాల్సిందే.
Updated Date - 2022-08-04T06:04:39+05:30 IST