ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు రాజ్యం కోసమే పల్లె పల్లెకు కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2022-07-05T06:14:00+05:30

రైతురాజ్యం కోసం పల్లె పల్లెకు కాంగ్రెస్‌పార్టీ చేరుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాచారెడ్డి, జూలై 4: రైతురాజ్యం కోసం పల్లె పల్లెకు కాంగ్రెస్‌పార్టీ చేరుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. మండలంలోని నడిమి తం డా, వెనుక తండా, బొడగుట్టు తండా, అంకిరెడ్డిపల్లి, ఎల్లంపేట, రాజ్‌ఖాన్‌పేట్‌ గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని వందలాది మందివిద్యార్థులు ఆత్మబలి దానాలను చూసిన కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన ప్రధాని నరేంద్రమోదీ పదతి ప్రకారం తెలంగాణ ఏర్పడలేదని వ్యా ఖ్యలుచేసి అమరులను అవమనించారన్నారు. ఏం సాధించారని విజయసంకల్పసభ, ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్నందుకా, రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకువచ్చి 700 మంది రైతులు ప్రాణాలను బలిగొన్నందుకా, ఎరువులు, డీజిల్‌ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచినందుకా సమాధానం చెప్పాలని అన్నారు. నోట్ల రద్దుతో సామాన్యుడి నడ్డివిరిచి, కరోనాకష్టకాలంలో కూలీలను,పేదలను గాలికి వదిలిపెట్టారని అన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏముఖంతో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. దేశంలో మోదీ మొండిగా ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్‌ కేడిలా తయారయ్యారని అన్నారు. ఏ అభివృది పనిచూసిన కాంగ్రెస్‌ హయాంలో జరిగినది మాత్రమే కనబడుతుందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బం గారు మయమైందని తెలిపారు. రైతు డిక్లరేషన్‌పై కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణేష్‌నాయక్‌, భిక్కనూర్‌ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, యుత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్‌, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising