ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొసైటీ మాజీ చైర్మన్‌ ఇంటి ఎదుట ఆందోళన

ABN, First Publish Date - 2022-05-25T06:22:16+05:30

కూలీ నాలీ చేసి కూడగట్టుకున్న సొమ్మును మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామ సొసైటీలో డిపాజిట్‌ చేసుకుంటే.. తమ డబ్బులను సొసైటీ మాజీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి దిగమింగాడంటూ సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాల కు చెందిన పలువురు ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లు మంగళవారం ఆందోళనకు దిగారు.

గుమ్మిర్యాల్‌లో మాజీ సొసైటీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న డిపాజిటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ డబ్బులు తమకు చెల్లించాలని డిపాజిటర్ల డిమాండ్‌ 

ఏర్గట్ల, మే 24: కూలీ నాలీ చేసి కూడగట్టుకున్న సొమ్మును మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామ సొసైటీలో డిపాజిట్‌ చేసుకుంటే.. తమ డబ్బులను సొసైటీ మాజీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి దిగమింగాడంటూ సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాల కు చెందిన పలువురు ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామంలో గల మాజీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి ఇంటి ఎదు ట బాధిత డిపాజిటర్లు టెంట్‌ వేసుకుని మరీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లు మాట్లాడుతూ.. పది రోజుల క్రితం మాజీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డితో పాటు సీఈవో భీమనాతి స్వామి అవినీతిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి మాజీ చైర్మన్‌ పరారీలో ఉన్నాడని మండిపడ్డారు. సొసైటీలో రూ.3 కోట్ల 27లక్షల అవినీతి చేసి డిపాజిటర్లను రోడ్డుపై పడేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్లు రెట్టింపు చేస్తానని ఆశపెట్టి, అవినీతి చేసి గోస పెడుతున్నాడని సోమ చిన్న గంగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ చైర్మన్‌తో పాటు సీఈవో స్వామి ఆస్తులను వేలం వేసి.. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2022-05-25T06:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising