ప్రసాద్‌గౌడ్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులు
ABN, First Publish Date - 2022-08-04T06:13:20+05:30
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేశారు. ఆయనపై 452, 120బి, 506, 307 సెక్షన్‌ల కింద బంజారహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్రకేసులో కొనసాగుతున్న దర్యాప్తు
నిజామాబాద్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేశారు. ఆయనపై 452, 120బి, 506, 307 సెక్షన్‌ల కింద బంజారహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు ఇదే కేసులో ఏ-2గా ప్రసాద్ భార్య సర్పంచ్ లావణ్యను కూడా చేర్చారు. హత్యపూరిత కుట్ర, అక్రమ ఆయుధాల నిల్వలు, ఆయుధాల క్రయవిక్రయాలు వంటి కేసులను ప్రసాద్‌గౌడ్‌పై నమోదు చేశారు. ఎమ్మెల్యేపై హత్యకు కుట్ర జరిగిందని విషయం తెలియడంతో జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, మంచిర్యాల్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, రాజారామ్‌యాదవ్‌తో పాటు ఇతర నేతలు జీవన్‌రెడ్డిని పరామర్శించారు.
Updated Date - 2022-08-04T06:13:20+05:30 IST