మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యం
ABN, First Publish Date - 2022-11-10T01:08:22+05:30
మల్లారం అటవీప్రాంతంలో పూర్తి గా కాలిపోయిన శవం కలకలం కలిగించింది. బుధవారం ఉదయం గాం ధీనగర్‌వాసులు కాలిపోయిన శవం ఆనవాళ్లు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్‌హెచ్‌వో లింబాద్రి, సీఐ జె.నరేష్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్లు వచ్చి పోలీసు జాగిలాలను, క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలు కూడా నిందితుల జాడను పసిగట్టలేకపోయాయి.
నిజామాబాద్ రూరల్, నవంబరు9: మల్లారం అటవీప్రాంతంలో పూర్తి గా కాలిపోయిన శవం కలకలం కలిగించింది. బుధవారం ఉదయం గాం ధీనగర్‌వాసులు కాలిపోయిన శవం ఆనవాళ్లు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్‌హెచ్‌వో లింబాద్రి, సీఐ జె.నరేష్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్లు వచ్చి పోలీసు జాగిలాలను, క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలు కూడా నిందితుల జాడను పసిగట్టలేకపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లారం-మల్కాపూర్ తండా సమీపంలో అరకిలోమీటరు దూరంలో బండరాయిమీద ఓ పురుష మృతదేహం కాల్చినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతుడి వయస్సు 30-35 ఉండవచ్చని తెలిపారు. సమీపంలో మద్యం బాటిళ్లు కనిపించినట్లు చెప్పారు. మృతుడితోపాటు హత్యచేసినవారు కూడా కలిసి వచ్చి పార్టీ చేసుకుని తర్వాత ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుడిని పెట్రోలుపోసి కాల్చివేయడంతో శరీరం పూర్తిగా కాలిపోయిందన్నారు. ఎడమ పాదం మాత్రమే మి గిలిపోయిందని, రూరల్‌లోతోపాటు నగరంలో ఇటీవల మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వివరాలు లభిస్తాయన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే హంతకుల వివరాలు కూడా తెలుస్తాయని ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..
మల్లారం దట్టమైన అటవీప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. గాంధీనగర్ నుంచి మల్కాపూర్ తండా వరకు 8 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలం అక్రమార్కులకు అడ్డాగా మా రింది. పేకాట, మద్యం, పార్టీలు, వేట, అక్రమ కలపరవాణా, ఇతర అసాం ఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. అటు అటవీ అధికారులు, ఇటు రూరల్ పోలీసులు దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. దాంతో నగరానికి చెందిన పలువురు ఈ స్థలాన్ని తమ స్థావరంగా మార్చుకుంటున్నారు. పార్టీలకు అడ్డాగానే కాకుండా నేరాలకు కూడా స్థావరంగా మారింది. ప్రేమజంటను బెదిరించి నిలువుదోపిడీ చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చివరకు ఆత్మహత్య చేసుకునేవారు ఈ స్థలాన్నే ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అలాంటివి రెండు ఘటనలున్నాయి.
Updated Date - 2022-11-10T01:08:24+05:30 IST