ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంకర్‌లలో బిక్కుబిక్కుమంటూ బతికాం

ABN, First Publish Date - 2022-03-05T06:01:43+05:30

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్నప్పటి నుంచి యుద్ధ భూమిలోని బంకర్‌లలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చిందని వైద్యవిద్య కోర్సు కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన జిల్లా విద్యార్థులు అనుభవించిన యాతనను భయంగా చెబుతున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన హరిప్రియ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సైరన్‌ హెచ్చరిక రాగానే బంకర్‌లలోకి

- రాత్రులు కూడా అందులోనే ఉండే వాళ్లం

- బతికి భారత్‌కు వస్తామని అనుకోలేదు

- బాంబుల మోత మరింత భయపెట్టాయి

- కిలో మీటర్ల చొప్పున నడిచి భారత్‌ హెలిక్యాప్టర్‌ల స్థలానికి చేరుకున్నాం

- ఉక్రెయిన్‌ నుంచి కామారెడ్డికి చేరుకున్న వైద్య విద్యార్థుల మనోగతం


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి)/గాంధారి/బీబీపేట, మార్చి 4: ఉక్రెయిన్‌ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్నప్పటి నుంచి యుద్ధ భూమిలోని బంకర్‌లలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చిందని వైద్యవిద్య కోర్సు కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన జిల్లా విద్యార్థులు అనుభవించిన యాతనను భయంగా చెబుతున్నారు. హెచ్చరిక సైరన్‌ రాగానే బంకర్‌లోకి వెళ్లి తిండీ తిప్పలు లేకుండా రాత్రింబవ ళ్లు ఉండాల్సి వచ్చేది. నిద్ర ఉండకపోయేది. భారత్‌కు వెళ్లాలి అనే ఆలోచన మాత్రమే ఉండేది. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారు అంటూ ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన పలువురు వైద్య విద్యార్థులు తెలిపారు. కామారెడ్డి జిల్లా నుంచి వైద్యవిద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్‌లోని పలు యూనివర్సిటీలకు వెళ్లిన విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ వంతు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పిల్లలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో గడిపిన క్షణాలు ఎదురైన ఇబ్బందులు భారత్‌కు వచ్చేందుకు పడిన కష్టాలను పలువురు విద్యార్థులు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. జిల్లాలోని గాంధారి, నస్రూల్లాబాద్‌, బీబీపేట, కామారెడ్డిలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంబీబీఎస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా జిల్లాకు చేరుకున్నారు.

బిక్కుబిక్కుమంటూ ఫుట్‌పాత్‌లపై బతికాం

ఉక్రెయిన్‌లో ఓ వైపు రష్యా బాంబుల దాడితో మోత మోగిస్తుండగా భారత్‌కు చేరుకునేందుకు నానా తంటాలు పడ్డాం. యునివర్సిటీలోని హాస్టల్‌ల నిర్వాహుకులు చేతులు ఎత్తేయడంతో విద్యార్ధులందరం లగేజ్‌ సదురుకొని రోజుల తరబడి రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై బిక్కుబిక్కుమంటూ బతికామంటూ బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని బచ్చు హరిప్రియ తన ఆవేదనను వ్యక్తం చేసింది. సైరన్‌ వచ్చిదంటే బంకర్‌లోకి వెళ్లి తిండీ తిప్పలు లేకుండా నిద్రహారాలు మాని భారత్‌కు పయనమయ్యేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. హరిప్రియ ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవల రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. నాలుగు రోజుల పాటు మెట్రో అండర్‌ స్టేషన్‌లో ఉన్నానని, అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలకు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నానని ఖర్కివ్‌ నుంచి లివివ్‌ వరకు 1300 కి.మీ బస్సు, రైలు మార్గం గుండా భారత ఎంబీసీ చేరుకున్నానని ఆమె తెలిపింది. గురువారం అర్ధరాత్రి ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా ఇంటికి చేరడంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల వల్లనే తాను క్షేమంగా ఇండియాకు చేరుకున్నానని తెలిపారు. భారత ప్రభుత్వానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని హరిప్రియ వివరించింది.

కాలినడకతో ప్రయాణించాల్సి వచ్చింది

గాంధారి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఎంపీపీ రాధాబలరాం కూమారుడు రెండు నెలల క్రితం వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌ వెళ్లాడు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుండడంతో అక్కడ చదువుకుంటున్న రాహుల్‌ సొంత గ్రామానికి గురువారం అర్ధరాత్రి  చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టుకు కుటుంబసభ్యులతో పాటు జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ అక్కడికి వెళ్లి రాహుల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ నుంచి రోమేనియా వరకు కొద్దిదూరం బస్సులో ప్రయాణించగా ట్రాఫిక్‌జాం కావడంతో మధ్యలోనే వదిలిపెట్టారు. దీంతో రోమేనియా ప్రాంతానికి చేరుకునేందుకు 25 కిలో మీటర్లు  కాలినడకన రావాల్సి వచ్చింది. రోమేనియాలో చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తాను మళ్లీ ఇండియాలో అడుగుపెట్టానని తెలిపారు. తన కూమారుడు క్షేమంగా ఇంటికి చేరడంతో రాహుల్‌ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన నుంచి ఉపశమనం పొందారు.

బాంబుల మోత బయపెట్టింది

ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో దాడి చేస్తుండడంతో తాము నివాసం ఉండే ప్రాంతానికి కొద్ది దూరంలోనే బాంబుల మోత భయంతో బతికామని సచిన్‌గౌడ్‌ పేర్కొన్నాడు. నస్రూల్లాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సచిన్‌గౌడ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు కోసమై ఐదు నెలల కిందట ఉక్రెయిన్‌ వెళ్లాడు. స్థానికంగా ఉండే యూనివర్సిటీలో కోర్సు చేస్తు హాస్టల్‌లో ఉంటున్నాడు. యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి భారత్‌కు తిరిగి వెళ్లామోలేదోనని ఆందోళన చెందుతూ వచ్చాం. యుద్ధ నేపథ్యంలో స్థానికంగా సెల్‌ సిగ్నల్‌లు సైతం పని చేయలేదు. దీంతో ఐదారు రోజులు ఇంట్లో వారితో కమ్యూనికేషన్‌ లేకపోవడంతో దైర్యం చెప్పేవారే లేకపోయారు. దీంతో ఓ వైపు తాము భయం భయంగా బతుకుతుండగా మరోవైపు మా కుటుంబసభ్యులు మేము ఎలా ఉన్నామనేదానిపై ఆందోళన చెందుతూ వచ్చారు. మేము ఉండే ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులో రోమేనియా ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ భారత్‌కు సంబంధించిన ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరుకున్నాం.


Updated Date - 2022-03-05T06:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising