ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2022-01-23T05:22:38+05:30

కరోనా నియంత్రణపై అధికారు లు ప్రత్యేక దృష్టి సారించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న మందుల కిట్‌ను చూపిస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జనవరి 22: కరోనా నియంత్రణపై అధికారు లు ప్రత్యేక దృష్టి సారించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కరోనా నియంత్రణ, దళితబంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత 92శాతం, రెండో విడత 69శాతం మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. జిల్లాలో 2.10లక్షల గృహాలు ఉన్నాయని, వీటిలో జ్వర సర్వే ద్వారా 1.12లక్షల గృహాలను సర్వే చేసినట్లు తెలిపా రు. లక్షణాలున్న వారిని సర్వే బృందాలు గుర్తించి మందుల కిట్లను అందజేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో జిల్లా లో సర్వేను పూర్తి చేస్తారని తెలిపారు. జిల్లాలో 337 కొవి డ్‌ రోగుల కోసం బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మొదటి, రెండో విడతల్లో అన్ని వర్గాల అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో తక్కువ నష్టంతో బయటకు వచ్చామని తెలిపారు. ప్రస్తు తం కరోనా తీవ్రత అధికంగా ఉందని, దైర్యంగా ఉండాలని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు ఐదు రోజులు క్రమం తప్పకుండా మందులు వాడాలని పేర్కొన్నారు. వ్యాధి తగ్గకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. వింధులు, వినోదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. దళిత బంధు ద్వారా ప్రతీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో 350మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.35కోట్లు జిల్లాకు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising