ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక అంశాలు..

ABN, First Publish Date - 2022-08-04T16:17:35+05:30

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) పై హత్యాయత్నం అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్ గౌడ్‌ (Prasad Goud)తోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ప్రసాద్ గౌడ్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం సంచలనంగా మారింది. 


నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దగాని ప్రసాద్‌ గౌడ్‌ను ఏ-1గా, ఆయన భార్య, మాజీ సర్పంచ్‌ లావణ్యను ఏ-2గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరిపై 452, 120బి, 506, 307 తదితర సెక్షన్‌ల కింద బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్య పూరిత కుట్ర, అక్రమ ఆయుధాల నిల్వలు, ఆయుధాల క్రయవిక్రయాలు వంటి కేసులను నమోదు చేశారు. కాగా, ఈ కేసుపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసాద్‌ తన తలకు పిస్తోలు పెట్టి బెదిరించాడని జీవన్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోపక్క, ప్రసాద్‌ సంబంధిత భవనంలోని మూడో అంతస్తుకు వెళ్లినప్పుడు అతని చేతిలో పిస్తోలు లేదని జీవన్‌రెడ్డి అనుచరులు చెబుతున్నారు. పిస్తోళ్లు మాత్రం ప్రసాద్‌ కారులో లభించాయని పలువురు అంటున్నారు.

Updated Date - 2022-08-04T16:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising