ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయోజనులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-08T01:51:06+05:30

18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 7: 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమంలో నిర్ణీత గడువులో నమోదు చేసుకోనివారు ప్రత్యేక పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం సెల్‌కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఇప్పటికే జిల్లాలో కొత్తగా 27,154 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. బీపీవోలు ఇంటింటికి తిరుగుతూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ఫారం 6 మార్పుకు ఫారం 8 పూరించి జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. మార్పులు చేర్పులకు 5030 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు వెంట వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సెల్‌కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌, డీపీవో జయసుద, ఆర్‌డీవోలు రవి, శ్రీనివాస్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T01:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising