ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఓ మోస్తారు వర్షం

ABN, First Publish Date - 2022-09-10T07:23:00+05:30

జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తారు వర్షం పడింది. అన్ని మండలాల పరిధిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో సరాసరి 17 మి.మీల వర్షం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తారు వర్షం పడింది. అన్ని మండలాల పరిధిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో సరాసరి 17 మి.మీల వర్షం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మాక్లూర్‌ మండలంలో 45 మి.మీల వర్షం పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 791.9 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 1256.2 మి.మీల వర్షం పడింది.  

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులోకి 36740 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోని 8గేట్ల ద్వారా 24960 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవేకాకుండా వరద కాల్వకు 5వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 6500ల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో 90.13 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులోకి జూన్‌ నుంచి ఇప్పటి వరకు 323 టీఎంసీల నీళ్లు రాగా ప్రాజెక్టు నుంచి 253 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2022-09-10T07:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising