ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించండి:మంత్రి Niranjan reddy

ABN, First Publish Date - 2022-06-30T00:05:04+05:30

తెలంగాణలో రైతులను కూరగాయల సాగు వైపుమళ్లించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రైతులను కూరగాయల సాగు వైపుమళ్లించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఈఓ వంద మంది రైతులను ఎంపిక చేసుకుని ఉద్యాన పంటల వైపు మళ్లించాలని అన్నారు. బుధవారం డీఏఓలు, ఏడీఏలు, డీహెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సంధర్భంగా రైతులు, పంటల వివరాల నమోదు కోసం రూపొందించిన ఏఈఓ యాప్ ను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబరు నుండి మే వరకు వేయగలిగే పంటలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా సన్నద్దం చేయాలన్నారు.


అన్ని రైతువేదికలలో తప్పనిసరిగా బంతిపూల చెట్లను నాటాలన్నారు.డీఎఓలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని, తద్వారా రైతులతో సమన్వయం చేసుకోవాలన్నారు.తెగుళ్లు సోకి పంటలు నష్టపోయాక కాకుండా ముందే రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.జిల్లాల వ్యవసాయ సదస్సులు విజయవంతానికి అధికారులు తీసుకున్నచర్యలను మంత్రి అభినందించారు.ఎరువులు, విత్తనాలు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి.ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ రైతుబంధు వివరాలు అసంపూర్తిగా ఉన్న ఖాతాలను వ్యవసాయ అధికారులు వెంటనే సరిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతుబంధు అందేలా చూడాలన్నారు.వివరాల నమోదు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T00:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising