ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్జ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు

ABN, First Publish Date - 2022-10-17T09:14:47+05:30

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) ప్రాజెక్టు ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌, అక్టోబరు 16: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) ప్రాజెక్టు ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చారో తెలపాలని ఆ నోటీసుల్లో కోరింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ న్యాల్‌కల్‌ మండలం మమిడిగి గ్రామానికి చెందిన పటేల్‌ రాజురెడ్డితో పాటు మరికొంత మంది రైతులు నెల రోజుల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. నిమ్జ్‌ ఏర్పాటు చేస్తే నిమ్జ్‌ పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు దెబ్బతిని వాతావరణ కాలుష్యంతో మనుషులకు, పశువులకు అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం నిమ్జ్‌ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2022-10-17T09:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising