ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి దాకా రిసెప్షన్‌.. ఆపై నవ వరుడి ఆత్మహత్య!

ABN, First Publish Date - 2022-06-07T09:01:37+05:30

ఆ ఇంట్లో రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరిగాయి. కొత్త జంట, కుటుంబ సభ్యులు, బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య, కుటుంబీకులతో ఉత్సాహంగా నృత్యాలు

తెల్లవారుజామున గొంతు, చేయి కోసుకొని

బలవన్మరణానికి పాల్పడ్డ నరేశ్‌


వైరా, జూన్‌ 6: ఆ ఇంట్లో రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరిగాయి. కొత్త జంట, కుటుంబ సభ్యులు, బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. అర్ధరాత్రి వరకు రిసెప్షన్‌ జరిగింది. అంతలోనే ఆ ఇంటిని అనూహ్య విషాదం ఆవహించింది. రిసెప్షన్‌లో తన జీవిత భాగస్వామి, కుటుంబీకులు, ఇతర బంధువులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసిన నవ వరుడు.. హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంభంపాటి నరేశ్‌ (29)కు ఏపీలోని ఎన్టీఆర్‌(కృష్ణా) జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన బంధువుల అమ్మాయి మరియమ్మతో ఈ నెల 4న వివాహం జరిగింది. ఆదివారం పుణ్యపురంలో రిసెప్షన్‌ నిర్వహించారు. రాత్రి 11 గంటల వరకు భార్య మరియమ్మ, బంధువులతో కలిసి నరేశ్‌ ఉత్సాహంగా గడిపాడు. నృత్యాలు చేశాడు. ఈ క్రమంలో గుణదలలోని చర్చికి వెళ్లేందుకు గాను సోమవారం తెల్లవారుజామున బంధువులందరినీ నరేశ్‌ నిద్ర లేపాడు.


అంతలోనే ఏం జరిగిందో తెలియదు.. బాత్‌రూంకి వెళ్లి వస్తానని చెప్పి లోపలకు వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తర్వాత బ్లేడుతో గొంతు, ఎడమ చేయి మణికట్టు భాగంలో కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయాడు. 20 నిమిషాలైనా బయటకు రాకపోవడంతో నరేశ్‌ అన్న సురేశ్‌, బంధువులు తలుపు కొట్టారు. స్పందించకపోవడంతో బాత్‌రూం తలుపు పైనుంచి చూడగా నరేశ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తలుపు పగులగొట్టి చూడగా.. అప్పటికే అతను తుదిశ్వాస విడిచాడు. ఎన్నో ఆశలతో ఉన్న నవ వధువు.. భర్త ఆత్మహత్యతో కన్నీరుమున్నీరైంది. 


నరేశ్‌ కుటుంబ నేపథ్యం..

పుణ్యపురంలోని కంభంపాటి ఇస్రాయిల్‌, నాగమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇస్రాయిల్‌ 25 ఏళ్ల కిందట మృతి చెందడంతో నాగమ్మ ఆశా వర్కర్‌గా పనిచేస్తూనే పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించింది. నరేశ్‌ 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఖమ్మం, హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. పెళ్లి జరిగి, ఆనందంగా ఉన్న సమయంలో నరేశ్‌ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

Updated Date - 2022-06-07T09:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising