ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KishanReddy: టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-15T23:54:12+05:30

జనగాంలో బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. టీఆర్ఎస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (New Delhi): జనగాంలో బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్రపై జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) ఖండించారు.  టీఆర్ఎస్ (Trs) దాడిని మంత్రి సమర్ధించుకోవడం ఘోరమన్నారు. బండి సంజయ్ పాదయాత్రతో  టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయని.. అందుకే భౌతికదాడులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని దాడులు చేసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు గ్రామ గ్రామాన పాతరేస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గానీ,  సీఎం కేసీఆర్ కుటుంబాన్ని గాని ఎవరు రక్షించలేరన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ పరిధిలో ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


ఎన్ని దాడులు జరిగినా ప్రజలు టీఆర్ఎస్‌ని ఓడిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి పోలీస్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు. పోలీసు అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కనుసనల్లో పని చేస్తున్నట్టు కనిపిస్తుందన్నారు. ఆరు, ఏడు నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైతే పొరపాట్లు చేశారో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. 





Updated Date - 2022-08-15T23:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising