ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెహ్రూ జూ పార్క్‌ @ 60

ABN, First Publish Date - 2022-10-07T07:42:57+05:30

జాతీయస్థాయిలో ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందిన నెహ్రూ జూలాజికల్‌ పార్కు 59 ఏళ్లు పూర్తి చేసుకొని 60వ వసంతంలోకి అడుగుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా మూడు ఎన్‌క్లోజర్లు

వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రోత్సహకాలు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందిన నెహ్రూ జూలాజికల్‌ పార్కు 59 ఏళ్లు పూర్తి చేసుకొని 60వ వసంతంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో సందర్శకులను విశేషంగా ఆకర్షించే ఈ జూపార్కులో అదనంగా మూడు ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు.  68వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా నెహ్రూ జూ పార్కులో కొత్తగా మీర్‌ క్యాట్‌, మార్మో సెట్‌, ఓపెన్‌ ఫిష్‌ పాండ్‌లు ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికాలో కనిపించే ముంగీస జాతికి చెంది న మీర్‌ క్యాట్‌, దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే చిన్న కోతి జాతికి చెందిన మార్మో సెట్‌ ఎన్‌క్లోజర్లను అటవీ సం రక్షణ ప్రధాన అధికారి, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ ప్రారంభించారు. వివిధ రకాల చేపలతో కూడి న కొత్త ఓపెన్‌ ఫిష్‌ పాండ్‌ను ఆవిష్కరించారు. కొన్నాళ్ల క్రితం జూలో జన్మించిన ఆసియాటిక్‌ సింహాని (ఆడ)కి ఈ సందర్భంగా అధికారులు ‘అదితి’ అని పేరు పెట్టారు. అలా గే జూ పార్క్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జూ క్యూరేటర్‌ రాజశేఖర్‌ గత ఏడాది కార్యకలాపాలపై రూపొందించిన నివేదికను సమర్పించారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జూ పార్క్‌ డైరెక్టర్‌, అదనపు పీసీసీఎఫ్‌ వినయ్‌ కుమార్‌ వెల్లడించారు. జూ పార్కు నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఉద్యోగులకు కేవీఎస్‌ బాబు మెమోరియల్‌ అవార్డులను ప్రదానం చేశారు.  జూలో జంతువులను దత్తత తీసుకున్న సంస్థలు, ప్రముఖులు, జూ నిర్వహణ కోసం విరాళాలు ఇచ్చిన సంస్థలు, దాతలను ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-10-07T07:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising