ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి: సీపీఎం
ABN, First Publish Date - 2022-12-16T01:25:45+05:30
బస్వాపూర్ రిజర్వార్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన.తిమ్మాపూర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం ఇల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు.
భువనగిరి రూరల్, డిసెంబరు 15: బస్వాపూర్ రిజర్వార్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన.తిమ్మాపూర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం ఇల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం అదనపు ఇనచార్జి కలెక్టర్ భూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నిర్వాసితులు 17 రోజులుగా తమ సమష్యలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఆయన వెంట సీపీఎం నేతలు కొండమడుగు నర్సింహ, పెంటయ్య, వెంకటేశ, దయ్యాల నర్సింహ ఉన్నారు.
Updated Date - 2022-12-16T01:25:50+05:30 IST