ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవరాత్రుల్లో నూతనోత్తేజం అందించే వంటకాలివే..

ABN, First Publish Date - 2022-10-03T00:59:20+05:30

దేశవ్యాప్తంగా నవరాత్రి (Navratri) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాలుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశవ్యాప్తంగా నవరాత్రి (Navratri) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాలుగా కనిపించే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ప్రాంతాలను బట్టి అమ్మవారి రూపాలు భిన్నంగా ఉండొచ్చు. ఈ నవరాత్రుల్లో అపారమైన శక్తి సంతరించుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజుల్లో కనిపించే రంగులకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. పూజా కార్యక్రమాలలో అది ప్రత్యేకతను తీసుకొస్తుంది. తెలంగాణ సంస్కృతిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.  


నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి విజయదశమి (Dasara) వరకు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం సిద్ధం చేసే తీరు, దానిని వినియోగించే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ తీసుకునే ఆహారాన్ని తీసుకోరు. వాడే పదార్థాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ సీజన్‌లో లభించే పండ్లు, కూరగాయలకు ప్రత్యేకాదరణ ఉంటుంది. అదనంగా సంప్రదాయ ఆహారాలైన సత్తు, రాజ్‌గిర, షింగారా ఆటా, సాబుదానా వంటివి వాడతారు. ఇవి శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. 


దుర్గా పూజ రోజున అతి సరళమైన కిచూరి నుంచి విస్తృతశ్రేణి ఇలిష్‌  షోర్సీ (హిల్సా ఫిష్‌ కర్రీ) , దోయీ మచ్‌ (పెరుగు, ప్రత్యేక స్పైసెస్‌లో రోహు చేప వండడం) ఉంటాయి . విభిన్నమైన వెజిటేరియన్‌ వంటకాలు అయిన ఘుగిని (సెరల్స్‌తో చేస్తారు), అలూ పోస్తో వంటివి ఉంటాయి. రసగుల్లా లేకుండా ఈ భోజనమూ పూర్తి కానే కాదు. పండుగ సమయాల్లో దేశంలోని ఆయా ప్రాంతాల సాంస్కృతిక వైభవం మరింతగా కనిపిస్తుంది. తరతరాలుగా సంప్రదాయాలను పాటించడం వీటిలో మరింత ప్రత్యేకమని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా పేర్కొన్నారు.  ఈ దసరా ప్రతి ఒక్కరిలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-10-03T00:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising