ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి KCR ఏం చేస్తారు?: రేవంత్‌

ABN, First Publish Date - 2022-06-16T00:47:29+05:30

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేస్తారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేస్తారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ప్రధాని మోదీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారన ఎద్దేవాచేశారు. నైతిక విలువలు లేని నేత కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. కలిసి పనిచేద్దామని ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమత దగ్గరకెళ్లిన కేసీఆర్‌.. ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి ఎందుకు వెళ్లలేదు? అని రేవంత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కేసీఆర్‌ వ్యతిరేకమంటున్నారని, బీజేపీకి కూడా వ్యతిరేకమైతే అభ్యర్థిని దింపుతారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ను చూపి కేసీఆర్ బీజేపీకి లొంగడం మొదటిసారేం కాదన్నారు. ప్రధాని మోదీని వ్యతిరేకించేవారితో కేసీఆర్‌ కలవరని తేలిందని విమర్శించారు. ఈడీ పేరుతో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌ను బీజేపీ వేధిస్తోందని తప్పుబట్టారు. దీనికి నిరసనగా గురువారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. ఎల్లుండి జిల్లాల్లోని కేంద్రప్రభుత్వ ఆఫీస్‌ల ఎదుట నిరసన చేపడుతామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-06-16T00:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising