ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. గీతారెడ్డిని ప్రశ్నించిన ఈడీ

ABN, First Publish Date - 2022-10-07T08:33:04+05:30

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, గీతారెడ్డి, ఆ పార్టీ నేత గాలి అనీల్‌కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, గీతారెడ్డి, ఆ పార్టీ నేత గాలి అనీల్‌కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా రెండు వారాల క్రితమే తెలంగాణకు చెందిన పలువురు నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఈడీ ముందు హాజరుకాగా, గురువారం గీతారెడ్డి, అనీల్‌కుమార్‌ హాజరయ్యారు. వీరిద్దరిని దాదాపు 4 నుంచి 5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. నేషనల్‌ హెరాల్డ్‌కు డబ్బులు ఎవరు చెబితే ఇచ్చారు ? ఎంత మొత్తంలో చెల్లించారు? ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. తాను రూ.20 లక్షల చెక్కు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలియజేశానని గాలి అనీల్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2022-10-07T08:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising