ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినా హాజరుకాలేదు : కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-04T10:06:35+05:30

కేంద్ర సాంస్కృతిక శాఖ హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘జాతీయ సంస్కృతీ మహోత్సవాలు’ మూడోరోజైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవాడిగూడ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాంస్కృతిక శాఖ హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘జాతీయ సంస్కృతీ మహోత్సవాలు’ మూడోరోజైన ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జయప్రభ మీనన్‌ నాట్య ప్రదర్శన అలరించింది. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జాతీయ సంస్కృతీ మహోత్సవం’ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు సీఎం కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించినా హాజరుకాలేదన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గురించి కొన్ని పత్రికలు రాయకపోగా, ఇష్టానుసారంగా విమర్శలు చేశాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికలు, మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-04-04T10:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising