ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌పై నారాయణ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-25T09:31:07+05:30

శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(అలిండ్‌)కు చెందిన విలువైన భూములను భయానక వాతావరణం సృష్టించి, కబ్జా చేయడం పట్ల సీపీఐ జాతీయ కార్యద ర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దౌర్జన్యంగా భూములు కబ్జా చేస్తారా?
  • ప్రభుత్వం వెంటనే స్పందించాలి: నారాయణ


హైదరాబాద్‌ సిటీ/గచ్చిబౌలి, మే 24 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(అలిండ్‌)కు చెందిన విలువైన భూములను భయానక వాతావరణం సృష్టించి, కబ్జా చేయడం పట్ల సీపీఐ జాతీయ కార్యద ర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికుల హక్కు లు, ఉపాధిని కాలరాసేలా వ్యవహరిస్తోన్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోకుండా.. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండ డం సమంజసం కాదన్నారు. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నిజంగా ఇక్కడ భూమి ఉంటే.. న్యాయపరంగా ముం దుకెళ్లాలే తప్ప.. అర్ధరాత్రి దౌర్జన్యంగా చొరబడడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన శేరిలింగంపల్లి సమీపంలోని అలిండ్‌ను సందర్శించారు. అనంతరం ఆయన అలిండ్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వర్‌రావు, డివిజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఎస్‌.డి.రామరాజు తదితరులతో కలిసి.. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు ఆయన అలిండ్‌ భూమిలో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంచె వేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు.


 ‘‘అర్ధరాత్రి 20 మంది రౌడీలు మారణాయుధాలు, ముసుగులు ధరించి వచ్చారు. పొక్లెయినర్లతో ప్రహరీని ధ్వంసం చేశారు’’ అంటూ స్థానికులు చెప్పారు. దీనిపై నారాయణ తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ పరిశ్రమలో 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 100 మంది ఇక్కడి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి భూములను ఆక్రమించుకుని.. కార్మికుల క్వార్టర్లకు విద్యుత్తు, తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీనిపై సివిల్‌ కేసు నమోదు చేయా లి. వారికి న్యాయం జరిగేం త వరకు పోరాటం చేస్తాం. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఉద్యమాన్ని ఆపేదిలేదు’’ అని హెచ్చరించారు. కబ్జాదారులు ఏర్పా టు చేసిన కంచెను తొలగించాలని డిమాండ్‌ చేశారు. నారాయణ వెంట మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.


విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలి

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఐఎ్‌సబీ విద్యార్థులపై నిఘా పెట్టడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కే.నారాయణ ఆరోపించారు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో రైతుచట్టాలపై ఉద్యమ సమయంలో ప్రధానికి వ్యతిరేకంగా ట్విటర్‌, సోషల్‌ మీడియాలో ఎంతోమంది  పోస్టులు పెట్టారని.. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నిఘాను ఆపకపోతే విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.  

Updated Date - 2022-05-25T09:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising