ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజనుల పోరాట యోధుడు పాపన్న

ABN, First Publish Date - 2022-08-19T06:13:17+05:30

బహుజనుల పోరాట యోధుడు పాపన్న

సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిలో మాట్లాడుతున్న నన్నపునేని నరేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ 

వరంగల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 18 : దొరల అరాచకాలను.. మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు, బహుజనుల రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని వరంగల్‌ తూర్పు ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌ కొనియాడారు. పాపన్నగౌడ్‌ జయంతిని బీసీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనగారిన వర్గాలు, అట్టడుగు వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అన్ని వర్గాలను గౌరవిస్తూ బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీఅన్ని వర్గాలకుసహాయ సహకారాలను అందిస్తు న్నారన్నారు. లోకం పట్ల అవగాహన ఉన్నవ్యక్తి పాపయ్యగౌడ్‌ అని అన్నారు. అలాంటి త్యాగథనుల వేలాది మంది త్యాగాల ఫలితమే ఈరోజు మన వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాలను విస్తృత ప్రచారం జరిపి ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో గౌడ కులస్థులకు వారి అభ్యర్థన మేరకు కులసంఘం కార్యాల యం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఇప్పటికే గౌడ కులస్థుల కొరకు 2 వేల గజాలలో రూ.కోటి 20 లక్షల వ్యయంతో ఫంక్షన్‌హాల్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.హరిసింగ్‌, కె.శ్రీవత్స, బీసీ సంక్షేమ అధికారి శంకర్‌, డీపీవో స్వరూపరాణి, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్‌, వివిధ కులసంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T06:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising