ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-11T06:02:30+05:30

భువనగిరి పట్టణానికి చెందిన డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన, అగస్టు 10: భువనగిరి పట్టణానికి చెందిన డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్బనకాలనీకి చెందిన డ్రైవర్‌ ఎండీ అప్సర్‌(26) ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లాడు. తన మినీ ట్రాన్సపోర్ట్‌ వాహనాన్ని బస్వాపూర్‌ మార్గంలో నిలిపివేసి ‘ఇదే నా చివరి రోజు’ అని వాట్సాప్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం పంపాడు. దీంతో ఆందోళనకు గురైన అతని తండ్రి ఎండీ. ఇషాక్‌ అదేరోజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈ క్రమంలో అర్బన కాలనీ వెనకాల గల చెట్ల పొదల్లో నుంచి దుర్గంధం వస్తుందని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లా చూశారు. చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతున్న అస్సర్‌ మృతదేహం లభించింది. అతను ఇంటి నుంచి వెళ్లిన రోజే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అప్సర్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 


Updated Date - 2022-08-11T06:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising