పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-12-17T23:46:26+05:30
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మ ండలంలోని ఊకొండిలో శనివారం జరిగింది.
మునుగోడు రూరల్, డిసెంబరు 17: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మ ండలంలోని ఊకొండిలో శనివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డి కేశయ్య కుమార్తె సంధ్యారాణి(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. సంధ్య చిన్నప్పుడే తల్లి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సంధ్య తన అమ్మమ్మ గారి ఊరైన చౌటుప్పల్ మండలం తూర్పుగూడెంలో ఉండి చదువుకుంది. సంవత్సన్నరం నుంచి ఊకొండిలోని తండ్రి, అన్నయ్య సాయి వద్దనే ఉంటోంది. మును గోడులోని కస్తూర్బా కళాశాలలో ఇంటర్ చదువుతుంది. హాస్టల్‌లో భోజనం సరిగ్గా లేదని రెండు నెలలు క్రితం ఊకొండికి వచ్చి ఇంట్లోనే ఉంటోంది. సాయి బతుకుదెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. తండ్రి కేశయ్య కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి గ్రామంలో ఇల్లు లేకపోవడంతో వ్యవసాయ బావి వద్ద చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో సంధ్య పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన తండ్రి ఈ విష యాన్ని తన సోదరుడు పాపయ్యకు చెప్పాడు. ఆమెను మునుగోడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం 108లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెం దింది. ఈ విషయంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఆస్పత్రిలో ఉంచారు.
Updated Date - 2022-12-17T23:46:28+05:30 IST