ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెదడులో కణితులకు ప్రపంచస్థాయి చికిత్స

ABN, First Publish Date - 2022-01-13T07:05:12+05:30

మెదడులో కణుతులకు యశోద ఆస్పత్రిలో ప్రపంచస్థాయి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తు న్నట్లు ఆస్పత్రి సీనియర్‌ న్యూరో సర్జన్లు డాక్టర్‌ రవీష్‌సుంకర, రామకృష్ణచౌదరి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలాజీ హోటల్‌లో 3టి ఇంట్రా ఆపరేటివ్‌ ఎంఆర్‌ఐ శస్త్ర చికిత్సపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో వారు మాట్లాడారు. కోదాడ పట్టణాని

మాట్లాడుతున్న డాక్టర్లు రవీష్‌సుంకర, రామకృష్ణచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యశోద ఆస్పత్రి సీనియర్‌ న్యూరో సర్జన్లు డాక్టర్‌ రవీష్‌సుంకర, రామకృష్ణచౌదరి 

సూర్యాపేటటౌన్‌, జనవరి 12: మెదడులో కణుతులకు యశోద ఆస్పత్రిలో ప్రపంచస్థాయి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తు న్నట్లు ఆస్పత్రి సీనియర్‌ న్యూరో సర్జన్లు డాక్టర్‌ రవీష్‌సుంకర, రామకృష్ణచౌదరి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలాజీ హోటల్‌లో 3టి ఇంట్రా ఆపరేటివ్‌ ఎంఆర్‌ఐ శస్త్ర చికిత్సపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో వారు మాట్లాడారు. కోదాడ పట్టణానికి చెందిన ము నిసిపల్‌ పారిశుధ్య కార్మికురాలు పిడమర్తి చంద్రమ్మ కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతోందని, గత సంవత్సరం సెప్టెంబరు నెలలో పక్షవాతం రాగా, హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ యశోద ఆస్పత్రిలో అనే క పరీక్షలు చేశామని తెలిపారు. ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ (మెదడు లో కణుతులు)గా గుర్తించినట్లు తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రెయిన్‌ సర్జరీ విధానానికి ఇంట్రా ఆపరేటివ్‌ 3టి ఎంఆ ర్‌ఐ(ఐఎంఆర్‌ఐ) న్యూరో నావిగేషన్‌ పద్ధతిలో కేవలం మూడు గంటల వ్యవధిలోనే బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలి పారు. బాధితురాలు సైతం ఆరు రోజుల్లోనే పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉందన్నారు.  గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌కు సర్జరీ చేసిన నెలరోజులకు తిరిగి కణుతులు వచ్చే ఆస్కారం ఉండేదన్నారు. కానీ యశోద ఆస్పత్రి లో అధునాతన 3టి ఇంట్రా ఆపరేటివ్‌ ఎంఆర్‌ఐ ద్వారా గుర్తించి పూర్తిస్థాయిలో తొలగించడం సాధ్యపడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ కేవలం యశోద ఆస్పత్రిలో మాత్రమే ఉందన్నారు. ఎలాం టి వైద్యానికైనా తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంతో పాటు హెల్త్‌కార్డు వర్తిస్తుందన్నారు. మూడు గంటల్లో ఆపరేషన్‌ చేయడంతో పాటు వారం రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చానని పిడమర్తి చంద్రమ్మ తెలిపింది. 

Updated Date - 2022-01-13T07:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising